అండర్- 19 ఆసియా కప్ లో ఓడిన టీంఇండియా

అండర్- 19 ఆసియా కప్ లో ఓడిన టీంఇండియాస్పోర్ట్స్ డెస్క్ : అండర్- 19 ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో టీమిండియా పోరాడి ఓడిపోయింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో టీం ఇండియాపై పాక్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత పాక్ బౌలర్ జీషన్ జమీర్ 5 వికెట్లతో చెలరేగడంతో , భారత్ 49 ఓవర్లలో 237 రన్స్ కి ఆలౌటైంది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఛేదనలో పాక్ సరిగ్గా 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 240 పరుగులు చేసి విజయం సాధించింది.