ఎన్ని థాంక్స్ చెప్పినా తక్కువే : విజయ్ దేవరకొండ

ఎన్ని థాంక్స్ చెప్పినా తక్కువే : విజయ్ దేవరకొండహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపుపై తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖుల నుంచి హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తాజాగా హీరో విజయ్ దేవరకొండ సైతం ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనన్నారు. ఆరోగ్యకరమైన అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ప్రశంసించారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.

తెలంగాణ ప్రభుత్వం సినీరంగాన్ని పరిశ్రమగా మార్చాలని ఆలోచిస్తుందని అన్నారు. నేను నా ప్రభుత్వాన్ని ప్రేమిస్తున్నానని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. తెలుగు సినీ పరిశ్రమ దేశంలోనే అతిపెద్ద పరిశ్రమ అని విజయ్ దేవరకొండ అన్నారు.