హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు

హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలుహైదరాబాద్ : హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ గా సీవీ ఆనంద్ శనివారం బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుత సీపీ అంజనీ కుమార్ నుంచి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. కాగా హైదరాబాద్ సీపీగా ఉన్న అంజనీ కుమార్ కు ఏసీబీ చీఫ్ బాధ్యతలు అప్పగించింది. నూతన సీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు.హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలుఇక్కడే చదువుకుని, పెరిగి మళ్లీ హైదరాబాద్ కు సీపీగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పోస్టింగ్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు సీవీ ఆనంద్ థాంక్స్ చెప్పారు. దేశంలోనే చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీ హైదరాబాద్ అని, శాంతిభద్రతలు సజావుగా ఉంటేనే అభివృద్ధి సాగుతుందని ఆయన అన్నారు.

హైదరాబాద్ లో గతంలో అనేక బాధ్యతలు నిర్వర్తించిన తనకు శాంతిభద్రతలు కాపాడటమే ప్రధాన లక్ష్యమని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి సమావేశంలో సీఎం కేసీఆర్ శాంతిభద్రతలపైనే నిర్వహించారని సీపీ సీవీ ఆనంద్ గుర్తు చేశారు. సీసీ టీవీ విజిలెన్స్ , సాంకేతికత సాయంతో క్రైమ్స్ కు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. డ్రగ్స్ దందాలకు చెక్ పెట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. సైబర్ క్రైం నియంత్రించేందుకు ప్రత్యేక నిఘా పెడతామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.