డీజీపీ ఆఫీస్ లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు 

డీజీపీ ఆఫీస్ లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు

డీజీపీ ఆఫీస్ లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : డీజీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న డీజీపీ అంజనీ కుమార్ కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. డీజీపీ కార్యాలయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలకు డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్టమొదటి సారిగా అంజనీ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిరక్షణలో సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ నూతన సంవత్సర వేడుకల్లో పలువురు సీనియర్ పోలీస్ అధికారులు హాజరయ్యారు.