ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి ?

ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి ?

ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి ?

వరంగల్ టైమ్స్, డెవోషనల్ డెస్క్ : పరమ పవిత్రం వైకుంఠ ఏకాదశి పర్వదినం. వైకుంఠ ద్వార దర్శనం.. సర్వదా శుభదాయకం. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు. నెలకు రెండు చొప్పున 24 ఏకాదశులు ఉన్నప్పటికీ, అత్యంత ముఖ్యమైనది వైకుంఠ ఏకాదశే. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటారు. అందుకే ఈ పర్వదినాన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి రోజు మహావిష్ణువు గరుడ వాహనం అధిరోహించి మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి, భక్తులకు దర్శనమిస్తాడని నమ్మకం. ఇంతటి ప్రాశస్త్యమున్న వైకుంఠ ఏకాదశి పర్వదినం వేళ ఆలయాలన్నీ భక్తులతో సందడిగా మారతాయి. వేకువజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు. ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటారు.