వైకుంఠ ద్వారం.. తిరుమలలో పోటెత్తిన భక్తులు

వైకుంఠ ద్వారం.. తిరుమలలో పోటెత్తిన భక్తులు

వరంగల్ టైమ్స్, డెవోషనల్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటికిటలాడుతున్నాయి. తెల్లవారు నుంచే భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. వైకుంఠ ద్వారం.. తిరుమలలో పోటెత్తిన భక్తులుతిరుమల, యాదాద్రి, అన్నవరం, భద్రచలం, ద్వారక తిరుమల, మంగళగిరి, విజయవాడ, అనంతపురం, ధర్మపురి తదితర అన్ని ప్రముఖ ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి. ఇక తిరుమలలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా అర్ధరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వారం తెరిచారు. దీంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అయితే ముందుగా అత్యంత ప్రముఖులు, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులకు ఆలయ అధికారులు స్వామివారి దర్శనం కల్పించారు.

ఉదయం 5 నుంచి 6 గంటల వరకు శ్రీవాణి ద్వారా టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తులను అనుమతిస్తున్నారు. తిరుమలలో ఈ నెల 11 వరకు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాగా, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలు, ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశామన్నారు.