సిట్ కు బదిలీ ఐన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు 

సిట్ కు బదిలీ ఐన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు

సిట్ కు బదిలీ ఐన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు 

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిట్ కు బదిలీ చేసింది. ఈ కేసును సిట్ కు బదిలీ చేస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగనుంది. ఈ కేసును ఇప్పటి వరకు బేగంబజార్ పోలీసులు దర్యాప్తు చేశారు. అసిస్టెంట్ ఇంజనీర్ ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి నిందితులపై 120 (బీ), 409, 420 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో 9 మంది నిందితులకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏ రేణుకను చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు. మిగతా 8 మందిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ రాతపరీక్ష ప్రశ్నాపత్రం లీకైందని సమాచారం అందడంతో టీఎస్సీపీఎస్సీ అధికారులు అప్రమత్తమైన సంగతి విదితమే. ఇక ఈ నెల 12న జరగాల్సిన టీపీబీవో, 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రాతపరీక్షలను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్ లీక్ కేసులో టీఎస్పీఎస్సీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్ రెడ్డిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ను సస్పెండ్ చేశారు. గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక, ఆమె భర్త డీఆర్డీఏలో టెక్నికల్ అసిస్టెంట్ ఢాక్య, కానిస్టేబుల్ శ్రీనివాస్ తో పాటు మరో నలుగురిని రిమాండ్ కు తరలించారు.