భారత్ లో కొత్తగా 44,877 కరోనా కేసులు

భారత్ లో కొత్తగా 44,877 కరోనా కేసులువరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. శనివారం 50వేలకు పైగా నమోదైన పాజిటివ్ కేసులు తాజాగా 44 వేలకు తగ్గాయి. నిన్నటికంటే నేడు ఈ కేసులు 11 శాతం తక్కువేనని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. కరోనా మూడో వేడ్ ప్రారంభమైనప్పటి నుంచి 50 వేల లోపు కేసులు నమోదవడం ఇదే మొదటి సారి. రోజువారి కేసులు తగ్గుతుండటంతో పాజిటివిటీ రేటు కూడా తక్కువగానే ఉంటున్నది. దేశంలో కొత్తగా 44,877 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 684 మంది బాధితులు మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,26,31,421కి చేరాయి. 5,08,665కు మరణాల సంఖ్య చేరుకుంది.

మొత్తం కరోనా కేసుల్లో 4,15,85,711 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 5,37,045 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెల్పింది. అదే విధంగా రోజువారీ పాజిటివిటీ రేటు 3.17 శాతానికి తగ్గింనట్లు వెల్లడించారు. రికవరీ రేటు 97.55 శాతానికి చేరిందని వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 172.81 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది.