శుక్రవారం ప్రధాని ప్రీ బడ్జెట్‌ భేటీ !

శుక్రవారం ప్రధాని ప్రీ బడ్జెట్‌ భేటీ !

శుక్రవారం ప్రధాని ప్రీ బడ్జెట్‌ భేటీ !

 

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో ప్రీ బడ్జెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. నీతి ఆయోగ్‌లో జరగనున్న ఈ భేటీలో దేశ ఆర్థిక వ్యవస్థ, వృద్ధి పురోగతికి తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై ప్రధాని చర్చించనున్నారని సీనియర్‌ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు సమాచారం. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న 2023-24 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడతారని భావిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 భారత్‌ ఎకానమీ వృద్ధి రేటు 6.5-7.0 శ్రేణిలో నమోదవుతుందని అంచనా.