ఆ రాష్ట్రానికి సోమేశ్ కుమార్ కేటాయింపు రద్దు

ఆ రాష్ట్రానికి సోమేశ్ కుమార్ కేటాయింపు రద్దు

ఆ రాష్ట్రానికి సోమేశ్ కుమార్ కేటాయింపు రద్దు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేస్తూ హై కోర్టు తీర్పునిచ్చింది. చీఫ్ సెక్రటరీగా తెలంగాణలో సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పు వెల్లడించింది. ఏపీకి వెళ్లాలని సోమేశ్ కుమార్ ను కోర్టు ఆదేశించింది. ఐతే రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్ ను కేంద్రం ఏపీ సర్కార్ కు కేటాయించింది. దీంతో సోమేశ్ కుమార్ క్యాట్ ( కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ) ను ఆశ్రయించారు. ఈ క్రమంలో కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో సోమేశ్ కుమార్ తెలంగాణలో కొనసాగుతున్నారు.

ఈ క్రమంలో క్యాట్ ఉత్తర్వులు కొట్టేయాలని 2017లో కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు సీజే ధర్మాసనం మంగళవారం తీర్పు వెల్లడించింది. సోమేశ్ కుమార్ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలు 3 వారాలు నిలిపివేసింది కోర్టు. 2019, డిసెంబర్ నుంచి తెలంగాణ సీఎస్ గా సోమేశ్ కుమార్ కొనసాగుతున్నారు.