లారీ డ్రైవర్ హత్య..క్యాబిన్ లో డెడ్ బాడీ

పెద్దపల్లి జిల్లా : లారీ డ్రైవర్ ను హత్య చేసి లారీ క్యాబిన్ లోనే పెట్టిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్ లో చోటు చేసుకుంది. గంగానగర్ కాలనీకి చెందిన సప్ప రాయమల్లు (45) లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే తోటి డ్రైవర్లతో కలిసి రాత్రి మందు పార్టీ చేసుకున్నారు.

ఈ క్రమంలోనే వారి మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో రాయమల్లును హత్య చేసి లారీ క్యాబిన్ లోనే పెట్టారు. గోదావరిఖని టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. క్లూస్ టీంను రంగంలోకి దింపి హత్యకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.