వరంగల్ జిల్లా : వరంగల్ లో భారీగా ఎండు గంజాయి పట్టుబడింది. వరంగల్ రైల్వే స్టేషన్ లో అక్రమంగా తరలిస్తున్న ఎండుగంజాయిని జీఆర్పీ పోలీసులు గుర్తించారు. ఎండు గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
వారి నుంచి రూ.6 లక్షల 50వేల విలువ గల 65 కిలోల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు.