క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్

క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్హనుమకొండ జిల్లా : వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ పరిధి ఖానాపూర్ మండలం బుధరావుపేటలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.10వేల నగదు, 2సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం హనుమకొండలోని పోలీస్ కమిషనరేట్ లో ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి వివరాలు వెల్లడించారు.

బుధరావుపేటకు చెందిన ఎర్రబెల్లి అనిల్ గ్రామంలో ఫర్టిలైజర్ షాపు నిర్వహించేవాడు. జల్సాలకు అలవాటుపడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో, అదే గ్రామానికి చెందిన మల్యాల భరత్ తో కలిసి క్రికెట్ బెట్టింగ్ మొదలు పెట్టారు.

అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లపై అవగాహన ఉన్న యువకులతో కలిసి, వీరిద్దరూ బెట్టింగ్ నిర్వహించేవారు. గెలిచిన వారి నుంచి 10 శాతం కమీషన్ తీసుకునేవారు. ఈనెల 26న బెట్టింగ్ లో పాల్గొన్న యువకుడు డబ్బులు ఇవ్వకపోవడంతో నిందితులు, అతడి ఇంటికి వెళ్లి బలవంతంగా బైక్ తీసుకొచ్చాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనిల్ , భరత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

గ్రామంలో బెట్టింగ్ కు పాల్పడుతున్న మరికొద్ది మందిని గుర్తించడంతో పాటు వారిని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుందని వెస్ట్ జోన్ డిసిపి వెల్లడించారు. బెట్టింగ్ పాల్పడుతున్న నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన నర్సంపేట ఏసిపి ఫణీందర్, నర్సంపేట్ రూరల్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ సూర్య ప్రసాద్, ఖానాపూర్ ఇంచార్జ్ సబ్-ఇన్ స్పెక్టర్ నవీన్ కుమార్, కానిస్టేబుళ్ళు మహేందర్, రాజులను ఈస్ట్ జోన్ డిసిపి అభినందించారు.