టెన్త్, ఇంటర్ పాసైనవారికి ఈఎస్ఐసీ సువర్ణావకాశం

టెన్త్, ఇంటర్ పాసైనవారికి ఈఎస్ఐసీ సువర్ణావకాశంన్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న యూడీసీ, స్టెనో , ఎంటీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కల్గినవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెల్పింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే యేడాది జనవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3847 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో తెలంగాణలో 72, ఏపీలో 35 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది.

మొత్తం ఖాళీలు 3847 ఇందులో మల్టీటాస్కింగ్ స్టాఫ్ 1931, అప్పర్ డివిజనల్ క్లర్క్ 1726, స్టెనోగ్రాఫర్ 163 చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఇక తెలంగాణలో యూడీసీ 25, స్టెనో 4, ఎంటీఎస్ 43 కాగా, ఆంధ్రప్రదేశ్ లో యూడీసీ 7, స్టెనో 2, ఎంటీఎస్ 26 చొప్పున ఉన్నాయి.

అర్హత : యూడీసీ పోస్టులకు డిగ్రీ పూర్తిచేసి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. స్టెనో పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణులై నిమిషానికి 80 పదాలు టైప్ చేసే సామర్థ్యం ఉండాలి. ఎంటీఎస్ పోస్టులకు టెన్త్ అర్హత ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 27 యేళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ : రాతపరీక్ష ద్వారా
యూడీసీ : ప్రిలిమినరీ, మెయిన్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్
స్టెనో : మెయిన్, స్కిల్ టెస్ట్
ఎంటీఎస్ : ప్రిలిమ్స్, మెయిన్స్
దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో
దరఖాస్తు ఫీజు : రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు రూ.250
దరఖాస్తులు ప్రారంభం : జనవరి 15, 2022
దరఖాస్తులకు చివరితేదీ : ఫిబ్రవరి 15, 2022
వెబ్ సైట్ : esic.nic.in