ఏపీ పెట్రోల్ బంకుల్లో బయటపడిన భారీ మోసం

ఏపీ పెట్రోల్ బంకుల్లో బయటపడిన భారీ మోసం

-వాహనదారుల జేబులకు చిల్లు పెడుతున్నపెట్రోల్ బంక్ లు
-మదర్ బోర్డ్ కి ప్రత్యేక మైక్రో చిప్ లు అమరిక
– ఏపీ లో పెద్ద ఎత్తున పెట్రోల్ బంక్ ల దోపిడీ

వరంగల్ టైమ్స్, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తూనికలు కొలతల శాఖ చేసిన తనిఖీల్లో మరోసారి మైక్రో మాయ బయటపడింది. ఏపీలో కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఎక్కువగా ఈ మైక్రో మోసాలను తూనికలు కొలతల శాఖ గుర్తించింది. పెద్ద ఎత్తున బంకుల మోసాలు బయట పడ్డాయి. అసలే పెట్రోల్ రేట్లు పెరగడంతో వాహనదారులుపై భారం పడుతుంటే ఈ మైక్రో చిప్ లు ద్వారా బంక్ యాజమాన్యం వాహనదారుల జేబులకు చిల్లు లు పెడుతుంది. విజయవాడ, గుణదల ఒక పెట్రోల్ బంక్ లో మోసం జరుగుతున్నట్లు సమాచారం అందటంతో తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.ఏపీ పెట్రోల్ బంకుల్లో బయటపడిన భారీ మోసం5లీటర్లకు 500 ఎంఎల్ తక్కువ వస్తున్నట్లు గుర్తించారు. అధికారులు మదర్ బోర్డ్ పరిశీలించగా అందులో కొన్ని మార్పులు చేసి తక్కువ వచ్చే విధంగా చేస్తున్నారు అని నిర్ధారణ అయింది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉన్న ఆ బంక్ లోని రెండు యూనిట్ల ద్వారా రోజు కు దాదాపు 7వేల లీటర్ల పెట్రోల్ లో 840 లీటర్ల వరకు మోసం జరుగుతున్నట్లు గుర్తించారు. బంక్ ను సీజ్ చేసి యజమాని పై కేసు నమోదు చేశారు.

తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలోని ఓ పెట్రోల్ బంక్ లో 5 లీటర్ల కు 120 ఎంఎల్ తక్కువ కొలత వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బంక్ లోని మెకానికల్, ఎలక్ట్రానిక్ బోర్డులు చూపిస్తున్న నెల రోజుల గణాంకాలు పరిశీలిస్తే రెండు బోర్డులో మధ్య 62.458 లీటర్ల వ్యత్యాసం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. లీటర్ కు 100 రూపాయల చొప్పున చూసిన నెలకు 62.45 లక్షలు దోపిడీ చేశారని అర్ధమవుతుంది.

బంక్ లోని మదర్ బోర్డులు, డిస్ప్లే బోర్డు, సెన్సారల్ సర్క్యూట్ బోర్డులను, పరిశీలనకై లాబ్ కి పంపగా వాటిలో మైక్రో కంట్రోలర్ చిప్ బోర్డు అమర్చినట్లు బయటపడింది. బంక్ యజమాని పై కేసు నమోదు చేశారు. ఇవే కాకుండా తూనికలు కొలతల శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఇటివలే 600 బంక్ లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 17 బంక్ ల్లో చిప్ లు పెట్టి మోసం చేస్తునట్లు గుర్తించారు. ఆ బంక్ లు సీజ్ చేసి యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు.