కరోనా వైరస్‌ వ్యాప్తికి కరెన్సీ నోట్లు

కరోనా వైరస్‌ వ్యాప్తికి కరెన్సీ నోట్లు

వరంగల్ టైమ్స్, ఏపీ : జనాల్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ కరెన్సీ నోట్ల ద్వారా వ్యాప్తి చెందుతోందా? అంటే, అవుననే అంటున్నారు అధికారులు. ఇప్పటి వరకు ఇటువంటి అనుమానాలు లేకపోయినా తాజాగా గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో గుర్తించిన రెండు కేసుల పూర్వాపరాలు పరిశీలించిన తరువాత ఈ నిర్థారణకు వచ్చారు. కరోనా వైరస్‌ ఎక్కువగా చేతుల్లోనే తిష్టవేసి ఉంటుంది. ఎందుకంటే దైనందిన జీవితంలో కంప్యూటర్‌ను ఆన్‌ చేయడం నుంచి బాత్‌రూంకు వెళ్లేటప్పుడు తలుపులు తీయడం, లిఫ్ట్‌ ఎక్కిదిగినప్పుడు డోర్ల ఆపరేషన్‌, స్విచ్ఛ్‌లు ఆన్‌ చేయడం అన్నీ చేతులతోనే చేస్తుంటారు.కరోనా వైరస్‌ వ్యాప్తికి కరెన్సీ నోట్లు