భారత్ లో కరోనా మరణాల్లో ముందు వరుసలో కేరళ

మళ్లీ 30 వేలు దాటిన కొత్త కేసులు
76 కోట్ల టీకా డోసుల పంపిణీ

భారత్ లో కరోనా మరణాల్లో ముందు వరుసలో కేరళ

 

ఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా తగ్గిన కేసులు మళ్లీ 30వేల మార్కును దాటాయి. మృతుల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపించింది. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 15,79,761 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..30,570 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. కేసులు ముందురోజు కంటే 12 శాతం పెరిగాయి.

మహమ్మారి కారణంగా నిన్న 431 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 3,33,47,325 మందికి వైరస్‌ సోకగా.. 3,25,60,474 కోలుకున్నారు. 4,43,928 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. 3.42 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 38 వేల మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం క్రియాశీల కేసుల రేటు 1.03 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.64 శాతానికి చేరింది.