గ్రామగ్రామాన గులాబీ జెండా పండుగ

గ్రామగ్రామాన గులాబీ జెండా పండుగ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జెండా పండుగను టీఆర్ఎస్ శ్రేణులు అట్టహాసంగా నిర్వహించాయి. పల్లెపల్లెనా, వాడవాడనా టీఆర్ఎస్ శ్రేణులు జెండాలను ఎగురవేసి, సంబురాలు నిర్వహించాయి. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. ఢిల్లీలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేస్తున్న సందర్భంగా కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు గులాబీ జెండా పండుగను నిర్వహించారు. ఇందులో భాగంగానే జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గూడెపల్లె గ్రామంలో టీఆర్ఎస్ శ్రేణులు గులాబీ జెండా పండుగను అట్టహాసంగా నిర్వహించాయి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మాజీ చైర్మన్ కొలుగూరి రాజేశ్వర్ రావు , గూడెపల్లె గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు నూకల భాస్కర్ లు గులాబీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రేగొండ మండల టీఆర్ఎస్ నాయకులు పెరుమాండ్ల మహెందర్ గౌడ్, రేగొండ మండల టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు ప్రశాంత్ రావు, టీఆర్ఎస్ నాయకులు పంచనేని రవిందర్ రావు, లింగంపల్లి భాస్కర్ రావు, టీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు. గులాబీ జెండా ఆవిష్కరించి, సంబురాలు చేసుకున్నారు. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ శంకుస్థాపన జరుపుకోవడం శుభపరిణామమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిలా నిలిచేలా చేసిన సీఎం కేసీఆర్ అంటూ ఆయనను పొగడ్తలతో కొనియాడారు.