రామ్ చరణ్ దంపతుల వెంటే ఆ టెంపుల్
వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ‘నాటు నాటు’ పాటలో అదిరిపోయే డ్యాన్స్ చేసిన చెర్రీ, ఆస్కార్ రాకతో మరింత ఫేమస్ అయ్యారు. అయితే తాజాగా రామ్ చరణ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. వ్యక్తిగత విషయానికస్తే చెర్రీకి దైవభక్తి ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఎన్నోసార్లు అయ్యప్పమాలలో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రామ్ చరణ్, ఉపాసన దంపతుల గురించి ఓ ఆసక్తికర విషయం ఒకటి తెలిసింది.
సీతారాముల విగ్రహాలు ఉండే ఓ చిన్న టెంపుల్ ను రామ్ చరణ్ దంపతులు ఎక్కడికి వెళ్లినా తమ వెంట తీసుకెళ్తారు. ఈ టెంపుల్ తమ వెంట ఉంటే అంతా మంచే జరుగుతుందని, అలానే అనుకున్న పనులు విజయం సాధిస్తాయని ఆ దంపతులు బలంగా నమ్ముతారట. అందుకే ఇటీవలే ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవంలో భాగంగా అమెరికా వెళ్లిన రామ్ చరణ్ దంపతులు సీతారాముల టెంపుల్ ను తమ వెంట తీసుకెళ్లారు.
తాజాగా ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో ఉపాసన సీతారాముల విగ్రహాలను తీసుకెళ్లారంట. ఈ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లే ముందు తమ హోటల్ రూంలో సీతారాముల విగ్రహాలను ఉంచి రామ్ చరణ్ దంపతులు పూజలు చేశారట. ఇక ఆ దేవుళ్లను రామ్ చరణ్ చూపిస్తూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
“నా భార్య ఎక్కడికి వెళ్లినా, తప్పకుండా ఈ చిన్న ఆలయాన్ని (సీతారామ, లక్ష్మణ, ఆంజనేయుస్వామి సమేత టెంపుల్ ) ఏర్పాటు చేస్తుంది. అది మాకు చాలా కాలం నుంచి అలవాటు అయ్యింది. ఈ టెంపుల్ మన ఆచారాలనే కాకుండా , భారతదేశానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది” అని రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇటీవల రామ్ చరణ్, ఉపాసన ఆ చిన్న ఆలయానికి పూజలు చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.