హైదరాబాద్ చేరుకున్న తారకరత్న పార్థివదేహం

హైదరాబాద్ చేరుకున్న తారకరత్న పార్థివదేహం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : నందమూరి తారకరత్న పార్థివ దేహాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చారు. నగరంలోని మోకిలలోని తన ఇంటికి తారకరత్న భౌతికకాయాన్ని తరలించారు. తారకరత్నను కడసారి చూసేందుకు నందమూరి కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.

ఫ్యాన్స్ సందర్శనార్థం రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫిలిం ఛాంబర్ లో తారకరత్న భౌతికకాయాన్ని ఉంచుతారు. సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.హైదరాబాద్ చేరుకున్న తారకరత్న పార్థివదేహంగత నెలలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురైన తారకరత్న దాదాపు 23 రోజుల పాటు ప్రాణాలతో పోరాడారు. తీవ్ర గుండెపోటు కారణంగా బ్రెయిన్ డ్యామేజీ అవ్వడంతో కోమాలోకి వెళ్లిన ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

తారకరత్న మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, అల్లరి నరేష్ పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.