కారును ఢీకొట్టిన లారీ..ఐదుగురు మృతి  

కారును ఢీకొట్టిన లారీ..ఐదుగురు మృతి  కారును ఢీకొట్టిన లారీ..ఐదుగురు మృతి  

వరంగల్ టైమ్స్, బాపట్ల : బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పంక్చర్ అయిన కారు అదుపుతప్పి డివైడర్ ను దాటి అవతలివైపునకు ఎగిరి పడింది. కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల బైపాస్ రోడ్డులో జాతీయ రహదారిపై ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారు ఈ ప్రమాదానికి గురైంది. అదే సమయంలో గుంటూరు నుంచి ఒంగోలు వైపు వస్తున్న లారీ ఆ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో నలుగురు మహిళలున్నారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు అద్దంకి ఎస్సై సమందరవలి భార్య వహీదా, కుమార్తె అయేషా, జయశ్రీ, దివ్యతేజ, డ్రైవర్ బ్రహ్మచారిగా గుర్తించారు. చిన్న గంజాం జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.