ఖదీర్ డెత్..కౌంటర్ దాఖలుకు హైకోర్టు ఆదేశం

ఖదీర్ డెత్..కౌంటర్ దాఖలుకు హైకోర్టు ఆదేశం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : మెదక్ పోలీసుల దాడిలో గాయపడి ప్రాణాలు కోల్పోయిన ఖదీర్ ఖాన్ మృతి పై హైకోర్టులో విచారణ జరిగింది. ఖదీర్ మృతి పై పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఖదీర్ మృతి పై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కేసు ను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, మెదక్ ఎస్పీ, డీఎస్పీ, ఎస్ హెచ్ఓకు ఆదేశించిన హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి 14కు పోస్ట్ పోన్ అయ్యింది.ఖదీర్ డెత్..కౌంటర్ దాఖలుకు హైకోర్టు ఆదేశంజనవరి 27న చైన్ స్నాచింగ్ కేస్ లో ఖదీర్ ను మెదక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈ నెల 3న అతను పోలీస్ కస్టడీ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. అయితే కోర్టులో హాజరుపరిచిన 14 రోజులకు అంటే ఈనెల 16న గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఖదీర్ మరణించినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఇదిలా ఉండగా ఖదీర్ మృతికి పోలీసులే కారణమని మీడియాలో కథనాలు వచ్చాయి. అలాగే ఖదీర్ పై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ఘటనపై హైకోర్టు జోక్యం చేసుకుంది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును సుమోటాగా నమోదుచేసినట్లు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలియచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ మార్చ్ 14 కు వాయిదా వేసిన హైకోర్టు.