బీజేపీని వీడే వారు వీళ్లే..వారి జాబితా ఇదే ?

బీజేపీని వీడే వారు వీళ్లే..వారి జాబితా ఇదే ?

బీజేపీని వీడే వారు వీళ్లే..వారి జాబితా ఇదే ?

బీజేపీలో కన్నా తరువాత వీడే వారి జాబితాలో విష్ణుకుమార్ రాజు, పురంధేశ్వరి ???

వరంగల్ టైమ్స్, అమరావతి : ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే ఆయన టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే టీడీపీ ముఖ్యనేతలు ఆయనను కలుస్తున్నారు. విష్ణుకుమార్ రాజు నిన్న కన్నాను కలిసి తరువాత సొంత పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదని కామెంట్ చేశారు.

విష్ణుకుమార్ రాజు కూడా కన్నా బాటలోనే పయనించేందుకు రెడీ అవుతున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన కామెంట్స్‌కు పురంధేశ్వరి కౌంటర్ ఇవ్వడం కూడా హాట్ టాపిక్‌ అయ్యింది. రంగా విషయంలో జీవీఎల్ కామెంట్స్ చేయగా.. ఎన్టీఆర్, వైఎస్ఆర్ గురించి పురంధేశ్వరి ప్రస్తావించారు. కన్నా తరువాత ఏపీ బీజేపీని వీడే వారి జాబితాలో విష్ణుకుమార్ రాజు, పురంధేశ్వరి కూడా ఉంటారా ? ఒకవేళ ఉంటే వాళ్లు ఏ పార్టీలో చేరతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.