బీజేపీ శ్రేణుల అరెస్ట్, నిరసనలో గాయపడ్డ పీఏ

బీజేపీ శ్రేణుల అరెస్ట్, నిరసనలో గాయపడ్డ పీఏవరంగల్ జిల్లా : కే.ఎం.సి ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అధికార పార్టీ చేసిన అవినీతి, అక్రమాలు బయట పెడతామనే భయంతోనే పోలీసులను అడ్డుపెట్టుకొని అరెస్టులు చేస్తున్నారని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. నేడు కే.ఎం.సీ ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను సందర్శించడానికి వెళ్లిన హనుమకొండ జిల్లా బృందంను పోలీసులు అరెస్ట్ చేశారు. కొవిడ్ నిభందనల పేరుతో వారిని అరెస్ట్ చేసి మట్వాడ పోలీస్ స్టేషన్ కి తరలించారు.

బీజేపీ శ్రేణుల అరెస్ట్, నిరసనలో గాయపడ్డ పీఏ

దీనిని నిరసిస్తూ రావు పద్మ, డాక్టర్ విజయచందర్ రెడ్డి, డాక్టర్ అశోక్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందట బైటాయించారు. అధికార పార్టీకి లేని కొవిడ్ నియమాలు, నిబంధనలు కేవలం ప్రతిపక్షాల పార్టీలకేనా అని రావు పద్మ ప్రశ్నించారు. కేఎంసీ ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో పూర్తి స్థాయిలో ప్రజలకు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయకుండా కాంట్రాక్టు నియామకాల పేరుతో ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకుల బృందం పర్యటిస్తే ఎక్కడ అధికార పార్టీ చేసిన అవినీతి, అక్రమాలు బయట పడతాయని పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమ అరెస్టులు చేస్తున్నారు అని విమర్శించారు.

మొత్తం 150 కోట్ల రూపాయిల బడ్జెట్తో నిర్మించిన ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో కేంద్ర ప్రభుత్వం వాట 120 కోట్ల రూపాయలను ఇచ్చిందని అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాటా 30 కోట్ల రూపాయిలను ఎందుకు ఇంత వరకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిధులను విడుదల చేసి పూర్తి స్థాయిలో పర్మినెంట్ స్టాఫ్ నియామకాలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. తప్పకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అక్రమాలను, అవినీతిని త్వరలోనే ప్రజల ముందు పెడతామని, అదే విధంగా కేంద్ర ప్రభుత్వనికి ఫిర్యాదు చేస్తామని రావు పద్మ స్పష్టం చేశారు.

పోలీసుల దాడిలో గాయపడ్డ రావు పద్మ పీఏ నిశాంత్..
ఈ నిరసనలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ పీఏ నిశాంత్ కు గాయాలు అయ్యాయి. కాకతీయ మెడికల్ కాలేజీ వద్దకి చేరుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, జిల్లా బృందంను పోలీసులు అడ్డుకున్న తీరు, వారి నిరసనను పీఏ నిశాంత్ తన మొబైల్ ద్వార సోషల్ మీడియాలో లైవ్ కవరేజ్ చేస్తున్నాడు. అయితే నిరసనను అడ్డుకునే క్రమంలో పీఏ నిశాంత్ పై అక్కడ విధులు నిర్వహిస్తున్న మట్వాడ ఎస్ఐ లైవ్ కవరేజ్ చెయ్యొద్దంటూ వారించారు. ఇందులో భాగంగానే పీఏ మొబైల్ లాక్కునే ప్రయత్నంలో శాంత్ చెయ్యి మెలిపెట్టడంతో ఎడమ చేతి మడిమలో గాయం అయ్యింది. గాయపడిన నిశాంత్ కి రోహిణి హాస్పిటల్ లో చికిత్స చేయించారు.

బీజేపీ శ్రేణుల అరెస్ట్, నిరసనలో గాయపడ్డ పీఏ

ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు గుజ్జుల మహేందర్ రెడ్డి, తోపుచర్ల అర్చన, మాచర్ల కుమారస్వామి, గంట దేవేందర్ రెడ్డి, తోపుచర్ల మధుసూధన్, శ్రీనివాస్, కమల్, పృథ్వీరాజ్ గౌడ్, ఆకాష్ సింగ్, ఓం ప్రకాష్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.