ప్రెస్ క్లబ్ లో సక్సెస్ ఫుల్ గా బూస్టర్ డోస్

ప్రెస్ క్లబ్ లో సక్సెస్ ఫుల్ గా బూస్టర్ డోస్హనుమకొండ జిల్లా : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోన థర్డ్ వేవ్ ప్రాణాంతకం కాకపోయినా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలని హనుమకొండ జిల్లా డీఎంహెచ్ ఓ డా.లలితా దేవి అన్నారు. నిత్యం సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే ఫ్రంట్ వారియర్స్ కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ప్రతీ మనిషికి స్వీయ నియంత్రణ అవసరమని తెలిపారు. టీకా విషయంలో అలసత్వం చేయకుండా సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరించి, శానీటైజర్స్ వాడాలని డీఎంహెచ్ఓ సూచించారు. వరంగల్ ప్రెస్ క్లబ్ ఆవరణలో రెండ్రోజుల పాటు జరిగిన బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. అయితే ఈ టీకా కార్యక్రమంలో రెండో రోజు డీఎంహెచ్ఓ డా. లలితా దేవి పాల్గొన్నారు. వ్యాక్సినేషన్ పట్ల ప్రజలకు, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా డీఎంహెచ్ ఓ ను ప్రెస్ క్లబ్ కమిటీ శాలువాతో సన్మానించింది. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల వెంకట్ . డెస్క్ ఫోరమ్ అధ్యక్షుడు షేంకేసి శంకర్ రావు టీయూడబ్ల్యూజె రాష్ట నాయకులు గాడిపల్లి మధు, డాక్టర్లు దుర్గాప్రసాద్, సౌజన్య, సిబ్బంది బాబు లీలా, కవిత, మౌనిక, రేణుక, శారదా, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు సుధీర్, సుధాకర్, రమేష్, దిలీప్, రాజు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.