జీ న్యూస్ యాజమాన్యానికి ఎర్రబెల్లి అభినందనలు

జీ న్యూస్ యాజమాన్యానికి ఎర్రబెల్లి అభినందనలుహైదరాబాద్ : దేశంలో అతిపెద్ద నెట్ వర్క్ ఉన్న ఛానెల్ జీ న్యూస్ తెలుగులో మరోసారి డిజిటల్ రంగంలో ప్రారంభమవుతున్నందుకు ఆనందంగా ఉందని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హైదరాబాద్ నగరంలో జీ న్యూస్ తెలుగు ఛానెల్ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి దయాకర్ రావు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జీ న్యూస్ తెలుగు ఛానెల్ యాజమాన్యం జీ నెట్ వర్క్ చైర్మన్ సుభాష్ చంద్రకు, ఎడిటర్ భరత్, మిగిలిన సిబ్బంది, పాత్రికేయ మిత్రులు ప్రతీ ఒక్కరికీ మంత్రి పేరు పేరునా శుభాకాంక్షలు తెలిపారు.

జీ న్యూస్ యాజమాన్యానికి ఎర్రబెల్లి అభినందనలు

 

అనంతరం జీ న్యూస్ నెట్ వర్క్ గురించి మంత్రి మాట్లాడారు. 1999లో ప్రారంభమైన జీ న్యూస్, అప్పటి నుంచి దేశంలోని అన్ని భాషలకు, ప్రాంతాలకు విస్తరించిందన్నారు. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జీ న్యూస్ యాజమాన్యాన్ని మంత్రి కోరారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లిని పలువురు ప్రముఖులు, ఛానల్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. వాళ్ళందరితో మంత్రి కాసేపు ఉల్లాసంగా గడిపారు.