హైదరాబాద్ : ‘కంచె’ సినిమా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌కి సౌత్‌లో ప్రత్యేకంగా పరిచయాలేవీ అక్కర్లేదు. రీసెంట్‌గా అఖండ బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో ప్రగ్యా జోరు మరో రేంజ్‌లో ఉంది. నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా నటించిన అఖండ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అదే జోరుతో నార్త్ లోనూ హల్‌చల్ చేస్తోంది ప్రగ్యా జైస్వాల్. సల్మాన్ ఖాన్ సరసన మెయిన్ ఛాలా అంటూ ఆడిపాడి హిందీ డెబ్యూ ఇచ్చేశారు ప్రగ్యా. ఈ పాటలో సల్మాన్, ప్రగ్యా మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని అంటున్నారు ఆడియన్స్. రీసెంట్ టైమ్స్ లో రిలీజైన సింగిల్స్ లో మెయిన్ ఛాలాకు మంచి స్పందన వస్తోంది.
“సల్మాన్ ఖాన్ సార్‌తో పనిచేయాలని ప్రతీ ఆర్టిస్టుకీ ఒక కల ఉంటుందని ప్రగ్యా తెలిపారు. నేను ఈ రంగంలో అడుగుపెట్టినప్పుడు కన్న కల ఇప్పుడు నిజమైంది. హిందీలో నా తొలి ప్రాజెక్టుతోనే ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సల్మాన్‌సార్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు గర్వంగా ఉంది. నిజానికి ఆయనతో రొమాంటిక్ పాటలో స్టెప్పులేసింది నేనేనా అని ఒకసారి గిల్లి చూసుకున్నాను (నవ్వుతూ). మెయిన్ ఛాలా బ్యూటీఫుల్ సాంగ్. గురు రంధ్వ, లులియా వంతూర్ ఈ రొమాంటిక్ మెలోడీని అద్భుతంగా ఆలపించారు. ఈ పాటను చూసిన, విన్న ప్రతి ఒక్కరికీ నచ్చి తీరుతుందనే నమ్మకం నాకుంది” అని ప్రగ్యా అన్నారు.