ముగిసిన రెండో రోజు ఆట..

ముగిసిన రెండో రోజు ఆట..స్పోర్ట్స్ డెస్క్ : సౌతాఫ్రికా సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టెస్ట్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో శుభారంభం అందించలేకపోయిన భారత ఓపెనర్లు రెండో ఇన్నింగ్స్ లో కూడా నిరాశపరిచారు. మయాంక్ అగర్వాల్ (7), కేఎల్ రాహుల్ (10) పరుగులు మాత్రమే చేశారు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన పుజారా (9నాటౌట్), కోహ్లీ (14 నాటౌట్ ) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. జాన్సెన్, రబాడ, ఎన్గిడీ వేసిన ఆఫ్ సైడ్ బంతుల గాలానికి పడకుండా ఇద్దరూ సంయమనం పాటించారు. దీంతో టీంఇండియా జట్టు రెండో రోజు ఆటను 57/2 స్కోరు వద్ద ముగించింది.

దీంతో సౌతాఫ్రికా జట్టుపై టీంఇండియా 70 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు భారత స్టార్ పేసర్ జస్ట్పీత్ బుమ్రా 5 వికెట్లతో చెలరేగడంతో సఫారీ జట్టు 210 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రాతో పాటు ఉమేష్ యాదవ్ 2, షమీ 2 శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ పడగొట్టారు.