హనుమకొండ జిల్లా : ఐనవోలు మల్లికార్జున స్వామి ఉత్సవాలు గురువారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. స్వామివారికి ఒగ్గు పూజారులు మేలు కొలుపు చేశారు. శైవాగమ పద్ధితిలో అర్చకులు ప్రాత:కాలంలో విఘ్నేశ్వరపూజ రుద్రాభిషేకం నూతన వస్త్రాలంకరణ చేశారు. తెల్లవారు జామున గణపతి పూజ శైవశుద్ధి పుణ్యాహవచనం నిర్వహించారు. దేవతలను ఆలయంలోకి ఆహ్వానిస్తూ ఉత్సవ ప్రారంభ సూచికగా కాషాయ ధ్వజ పతాకాలను చేతపట్టి మంగళవాయిద్యాలతో పరుష సూక్త మంత్ర పఠనంతో మూడు సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేూసి ఆలయ శిఖరం, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి గుడిపై ఎగురవేశారు.
అనంతరం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం , మహానివేదినే నీరాజన మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ చేసి ఉత్సవాలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఈవో అద్దంకి నాగేశ్వర్ రావు, ఆలయ ఉప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ , వేద పండితుడు గట్టు పురుషోత్తం శర్మ, ముఖ్యఅర్చకుడు ఐనవోలు మధుకర్ శర్మ, అర్చకులు, ధర్మకర్తలు, ఆలయ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.