పేదల అనారోగ్యానికి ఆర్థిక భరోసా కేసీఆర్ : చీఫ్ విప్ దాస్యం

పేదల అనారోగ్యానికి ఆర్థిక భరోసా కేసీఆర్ : చీఫ్ విప్ దాస్యంహైదరాబాద్ : అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎళ్లవేళలా అండగా నిలుస్తుందని, ఆర్థిక భరోసా కల్పిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అని తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం దర్గా కాజీపేటకు చెందిన పర్వీన్ బేగం అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది.

అయితే పర్వీన్ బేగం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుందన్న విషయాన్ని స్థానిక టీఆర్ఎస్ నాయకుల ద్వారా తెలుసుకున్న చీఫ్ విప్ దాస్యం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం సహాయనిధి నుండి రూ. 2 లక్షల 50వేల ఎల్ ఓసిని మంజూరు చేయించారు. ఇట్టి సీఎంఆర్ఎఫ్ చెక్కును గురువారం హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో లబ్ధిదారుడి కుటుంబ సభ్యులకు అందించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కును అందుకున్న బాధిత కుటుంబసభ్యులు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కి, సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.