ఫాదర్​ డాటర్​ సెంటిమెంట్​ చిత్రం ‘మర్డర్​’

ఫాదర్​ డాటర్​ సెంటిమెంట్​ చిత్రం ‘మర్డర్​’హైదరాబాద్​ : అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఆనంద్ చంద్ర దర్శకత్వంలో నట్టి కరుణ, నట్టి క్రాంతి లు నిర్మిస్తున్న రాంగోపాల్ వర్మ కుటుంబ కథా చిత్రం మర్డర్. డిసెంబర్ 24 న థియేటర్స్ లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో చిత్రాన్ని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో పాత్రికేయులకు, థియేటర్ ఓనర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు రెండు రోజులు ముందుగా చిత్రాన్నిప్రదర్శించారు.‘అందరూ మా ఇన్విటేషన్ ని పాజిటివ్ గా తీసుకొని వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు’ దర్శకుడు ఆనంద్​ చంద్ర. ‘పిలవగానే అందరూ వచ్చి మా సినిమా చూసినందుకు థ్యాంక్యూ . మా డైరెక్టర్ చెప్పినట్టు మూవీ పైన చాలా మందికి ఇందులో నెగిటివ్ చూయించారా.. పాజిటివ్ చూపించారా.. అని చాలా ప్రశ్నలు వచ్చాయి. వాటన్నిటినీ దాటుకొని ఈ సినిమా ఈ నెల 24న విడుదల చేస్తున్నాం’అన్నారు నిర్మాతలు నట్టి కరుణ, నట్టి కుమార్​. ఈ మూవీ అనుకున్నదానికంటే బాగా వచ్చింది.

ఇందులో ఎమోషన్, ఫాదర్ సెంటిమెంట్ అన్ని వున్నాయి. ప్రతి తల్లిదండ్రి కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. థియేటర్స్​ వారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి ఎలాంటి భయాందోళన చెందకుండా ప్రేక్షకులు వచ్చి సినిమా చూసి మాచిత్రాన్ని ఆదరించాని కోరుతున్నాము అన్నారు.
నటీనటులు ..
శ్రీకాంత్ అయ్యంగార్, గాయత్రీ భార్గవి, సాహితీ, గిరిధర్ ,దీపక్, గణేష్

సాంకేతికవర్గం..
నిర్మాతలు..నట్టి కరుణ /నట్టి క్రాంతి

దర్శకత్వం… ఆనంద్ చంద్ర

సంగీతం.. డీ ఎస్ ఆర్

డీవోపీ జగదీష్ చీకటి

ఎడిటర్ .శ్రీకాంత్ పట్నాయక్. ఆర్