నేడు తెలుగు రాష్ట్రాల్లో పట్టాలెక్కనున్న వందేభారత్

నేడు తెలుగు రాష్ట్రాల్లో పట్టాలెక్కనున్న వందేభారత్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : వందేభారత్ సెమీ హైస్పీడ్ రైలు జనవరి 14న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు జనవరి 15న అనగా నేడు సికింద్రాబాద్ స్టేషన్ లో ప్రారంభోత్సవం జరుపుకోనుంది. సికింద్రాబాద్, విశాఖపట్టణం నగరాల మధ్య తిరిగే ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని మోడీ నేడు ఉదయం 10.30 గంటలకు వర్చువల్ గా రిమోట్ వీడియో లింక్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు.

కాగా తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే ఈ వందేభారత్ రైలు ఆదివారం తప్ప వారంలో 6 రోజులు తిరుగుతుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతుంది. విశాఖ నుంచి బయల్దేరే వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు 20833 నంబర్ కేటాయించగా, సికింద్రాబాద్ నుంచి బయల్దేరే వందేభారత్ రైలుకు 208340 నంబర్ కేటాయించారు. వందేభారత్ రైలును అత్యాధునిక స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి రూపకల్పన చేశారు. వందేభారత్ ట్రయల్ రన్ లో గరిష్టంగా 180 కిలో మీటర్ల వేగాన్ని అందుకున్నప్పటికీ, దేశంలోని ట్రాక్ లను దృష్టిలో ఉంచుకుని దీన్ని 160 కిలో మీటర్ల వేగంతో నడపనున్నారు.నేడు తెలుగు రాష్ట్రాల్లో పట్టాలెక్కనున్న వందేభారత్వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఎక్కడెక్కడ ఆగుతుంది..
*విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు ( 20833) ప్రతీ రోజు ఉదయం 5.55 గంటలకు స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

*సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు ( 20834) ప్రతీ రోజు మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయ్యే ఈ రైలు రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది.

*వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో ఆగుతుంది.

*ఇందులో 14 ఏసీ చైర్ కార్టు, 2 ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కార్ కోచ్ లు ఉంటాయి. మొత్తం 1128 మంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేయవచ్చు.

వందేభారత్ ఛార్జీల వివరాలు..
చెయిర్ కార్ ఛార్జీలు ( ఒక ప్యాసింజర్ కు )
*బేస్ ఫేర్ రూ.1,206
*సూపర్ ఫాస్ట్ ఛార్జీలు రూ.45
*జీఎస్టీ రూ.65
*రిజర్వేషన్ ఛార్జీలు రూ.40
*కేటరింగ్ ఛార్జీలు రూ.364
*మొత్తం ప్యాసింజర్లు 1,720

ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఛార్జీలు( ఒక ప్యాసింజర్ కు )
*బేస్ ఫేర్ రూ.1,206
*సూపర్ ఫాస్ట్ ఛార్జీలు రూ.75
*జీఎస్టీ రూ.131
*రిజర్వేషన్ ఛార్జీలు రూ.60
*కేటరింగ్ ఛార్జీలు రూ.419
*మొత్తం మొత్తం ప్యాసింజర్లు 3,170