అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి మంత్రి ఎర్రబెల్లి

అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి మంత్రి ఎర్రబెల్లిజనగామ జిల్లా : రాష్ట్రంలోని పలు చోట్ల, వరంగల్ ఉమ్మడి జిల్లా, పాలకుర్తి నియోజకవర్గంలో కురుస్తున్న అకాల వర్షాల పట్ల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. అకాల వర్షాల వల్ల నెలకొన్న తాజా పరిస్థితులను అధికారులతో మాట్లాడి సమీక్షించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

అనుకోని విధంగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి అన్నారు. ఇప్పటికే ఆయా చోట్ల ప్రజా ప్రతినిధులు, ప్రజలకు అందుబాటులో ఉన్నారన్నారు. అలాగే, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను మరింత అప్రమత్తం చేసి, అవసరమైతే రక్షణ చర్యలు తక్షణమే చేపట్టాలని కోరారు. ప్రజలు ప్రస్తుత వాతావరణానికి తగ్గట్లుగా వ్యవహరించాలని కోరారు. పెద్దలు, పిల్లలను బయటకు రానివ్వొద్దని సూచించారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు.