NEET-PG కౌన్సిలింగ్ తిరిగి ప్రారంభం

NEET-PG కౌన్సిలింగ్ తిరిగి ప్రారంభంన్యూఢిల్లీ : NEET-PG కౌన్సిలింగ్ తిరిగి ప్రారంభంకానుంది. రిజర్వేషన్ ల విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నిలిచిపోయిన NEET-PGకౌన్సిలింగ్ ను తిరిగి కొననసాగించేందుకు సిద్ధమైంది. జనవరి 12 నుంచి NEET-PGకౌన్సిలింగ్ ను మొదలు పెట్టనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ఒక ప్రకటనలో వెల్లడించారు.

అదర్ బ్యాక్ బర్డ్ క్లాసెస్ ( ఓబీసీ), ఎకనామికల్లీ బ్యాక్ వర్డ్ క్లాసెస్ ( ఈడబ్ల్యూఎస్ ) రిజర్వేషన్ ల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఇటీవల NEET-PG కౌన్సిలింగ్ వాయిదా పడింది.

ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 శాతం రిజర్వేషన్ పద్ధతిలోనే కౌన్సిలింగ్ ను కొనసాగించాలని 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈనేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా జనవరి 12 నుంచి NEET-PG కౌన్సిలింగ్ ను కొనసాగించాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది.