టికెట్ చూసి షాక్ తిన్న ప్యాసింజర్

టికెట్ చూసి షాక్ తిన్న ప్యాసింజర్అమరావతి : ప్రయాణికులకు ఏపీఆర్టీసీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు మాస్కులు ధరించేలా కఠిన నిబంధనలు అమలు చేస్తుంది. మాస్కు లేకుండా బస్సుల్లో ప్రయాణించేవారికి రూ. 50 జరిమానా విధిస్తుంది.

జనవరి 9 నుంచి ఏపీ ఆర్టీసీ ఈ కొత్త నిబంధనను అమలు చేస్తున్నట్లు సమాచారం. ఓ వ్యక్తి మాస్క్ ధరించనందుకు ఏపీ ఆర్టీసీ రూ. 50 ఫైన్ వేసింది. దానికి సంబంధించిన ఓ టికెట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ విషయం తెలియడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలర్ట్ అవుతున్నారు.

మాస్క్ ప్రాధాన్యత తెలిసిన ప్రజలు, రూ. 50 ఫైన్ కట్టడం అవసరమా అనుకుంటున్నారు. కరోనా కాలంలో ప్రాణాలను కాపాడే మాస్క్ లేకుండా ప్రయాణం సరైంది కాదని డిసైడ్ అవుతున్నారు. ఇదిలా ఉండగా ఇలాంటి నిబంధనను తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కూడా పెట్టాలని కొంతమంది ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు తెలిపారు. ఏపీలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఇలాంటి నిబంధనలు పెట్టడం మంచిదైందని కొందరు అంటున్నారు.