కొత్తగా 1673 కరోనా కేసులు..ఒకరు మృతి

కొత్తగా 1673 కరోనా కేసులు..ఒకరు మృతిహైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 1673 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారితో ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు కరోనా బులెటిన్ రిలీజ్ చేశారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 48,583 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

వీరిలో 1,673 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,94,030కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 4,042 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 330 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,522 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.