ఏపీలో కొత్తగా 1,125 కొవిడ్ కేసులు..9 మరణాలు

ఏపీలో కొత్తగా 1,125 కొవిడ్ కేసులు..9 మరణాలుఅమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 49,568 పరీక్షలు నిర్వహించగా.. 1,125 కొవిడ్‌ కేసులు నిర్ధారణయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,31,974 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 9 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,019కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,356 మంది బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు 20,03,543 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,412 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,74,13,209 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.