అక్కడ గణేష్ నిమజ్జనాలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

అక్కడ గణేష్ నిమజ్జనాలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ లో ఈ ఏడాది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే చివరి అవకాశం అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. వినాయక విగ్రహాల నిమజ్జనం పిటిషన్ పై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిమజ్జనం అంశానికి సంబంధించి జీహెచ్ఎంసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జీహెచ్ఎంసీ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపింాచరు.అక్కడ గణేష్ నిమజ్జనాలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్జరుగుతున్న సమయంలో హై కోర్టు ఆర్డర్ వచ్చిందని సోలిసిటర్ జనరల్ తెలిపారు. గణపతి విగ్రహాలు చాలా వరకు ఎత్తుగా ఉన్నాయని తెలిపారు. అకస్మాత్తుగా ఉత్తర్వులను అమలు చేయడంతో అనేక ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం ఈ ఆర్డర్ ను అమలు చేస్తామని తుషార్ మెహతా తెలిపారు. ఇప్పటివకే హుస్సేన్ సాగర్ చుట్టూ క్రేన్ లు ఏర్పాటు చేశామని కాలుష్యం జరుగకుండా వెంట వెంటనే విగ్రహాలను తరలిస్తామని సోలిసిటర్ జనరల్ వివరించారు. హైదరాబాద్ వినాయక నిమజ్జనం ఇబ్బందులు తనకు తెలుసు అని సీజేఐ అన్నారు.

హుస్సేన్ సాగర్ పరిశుభ్ర పరిచేందుకు , సుందరీకరణకు ప్రతీ సంవత్సరం నిధులు ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రతీ సంవత్సరం విగ్రహాలను నిమజ్జనం చేయడం ద్వారా నిధులు వృథా అవ్వడం లేదా అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. 22 చిన్న పాండ్స్ ఏర్పాటు చేశామని, కానీ అందులో పెద్ద పెద్ద విగ్రహాలు నిమజ్జనం సాధ్యం కాదని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు.