పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

హైదరాబాద్ : శ్రీశైలం జలాశయానికి వరదనీటి ప్రవాహం కొనసాగుతుంది. ఈ సీజన్ లో నీటిపారుదల శాఖ అధికారులు వరుసగా మూడోవసారి జలాశయం గేట్లు ఎత్తారు. జలాశయం 12 క్రేస్ట్ గేట్లలో 3 గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కి నీటిని విడుదల చేశారు.పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లోగా 2,35,344 క్యూసెక్కులుగా వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే జలాశయం 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు గేట్ల ద్వారా 83 వేల 673 క్యూసెక్కులు వరదనీరు, అదే విధంగా ఔట్ ఫ్లోగా ఆంధ్రప్రదేశ్ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 27 వేల 750 క్యూసెక్కులు, తెలంగాణ ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం ద్వారా 31 వేల 784 క్యూసెక్కులు నీటిని వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేస్తు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయం నుంచి మొత్తంగా చూసుకుంటే ఔట్ ఫ్లోగా 1 లక్ష 43 వేల 207 క్యూసెక్కుల వరదనీరు విడుదల అవుతుంది. అయితే జలాశయం పూర్తి స్దాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 213.4011 టీఎంసీలుగా గరిష్ఠ స్దాయికి చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 884.60 అడుగులుగా ఉంటూ 3 గేట్లు 10 అడుగులు మేరకు ఎత్తి దిగువకునీటిపారుదలశాఖ అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.