కరోనా కట్టడి..వ్యాక్సినేషన్ తో సాధ్యం : చెవిరెడ్డి

* ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి
* స్పెషల్ డ్రైవ్ లో వంద శాతం పురోగతి
* ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
కరోనా కట్టడి..వ్యాక్సినేషన్ తో సాధ్యం : చెవిరెడ్డితిరుపతి : వ్యాక్సినేషన్ చేసుకోవడం ద్వారానే కరోనా కట్టడి సాధ్యమని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం చంద్రగిరి నియోజకవర్గంలో వ్యాక్సినేషన్ మేళ విజయవంతంగా నిర్వహించారు. తుమ్మలగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ వాక్సినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొని వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు.

తిరుపతి గ్రామీణ మండలములో 7,200 డోసెస్ లు అందుబాటులోకి వచ్చాయన్నారు. 100 శాతం వ్యాక్సినేషన్ చేయించుకోవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 18 నుంచి 45 సంవత్సరాల వరకు, 45 సంవత్సరాల పైబడిన వారికి, 5 సంవత్సరాల పిల్లలు ఉన్న తల్లులకు, గర్భిణి స్త్రీలకు వ్యాక్సిన్ వేసుకున్నట్లు వెల్లడించారు. కొవీషీల్డ్, కోవ్యాగ్జిన్ మొదటి డోసు, రెండవ డోసు వేశారని వివరించారు.

రానున్న థర్డ్ వేవ్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షించుకోవాలి అని సూచించారు.

ప్రజలు తప్పక మాస్కులు ధరించాలని, సామజిక దూరం పాటించాలని, సానిటైజర్ వినియోగించాలని తెలియజేశారు. వ్యాక్సినేషన్ వేసుకొని ధైర్యంగా ఉండాలని, ఎవరికీ ఏ ఇబ్బంది వచ్చినా వైద్యులను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుబ్బరామిరెడ్డి, సుధాకర్ రెడ్డి, జయచంద్రా రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.