మేడారంలో సకల ఏర్పాట్లు : ఎర్రబెల్లి, సత్యవతి

మేడారంలో సకల ఏర్పాట్లు : ఎర్రబెల్లి, సత్యవతివరంగల్ టైమ్స్, ములుగు జిల్లా: మేడారంలో జరుగుతున్న సమ్మక్క–సారలమ్మల జాతరకు కుటుంబ సమేతంగా వచ్చే భక్తుల కోసం సకల ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం నాడు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో మేడారంలో అన్ని ఏర్పాట్లు చేశామని, ఒక్క చిన్న లోటు కూడా ఉండకూడదని సీఎం ఆదేశించిన మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించేందుకు సీఎం సిద్దంగా ఉన్నారని ఎర్రబెల్లి అన్నారు. పారిశుధ్యం నిర్వహణలో ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భక్తులు కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మవార్లను దర్శనం చేసుకోవాలని సూచించారు. దగ్గు, జలుబు ఉన్నవారు వెంటనే సమీపంలోని వైద్యశాలను సంప్రదించండి. కరోనా ఉన్నవారిని క్వారెంటైన్ లో ఉంచే ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. ఆదివాసుల సంఘాలు, పూజారులు మీరు ఐక్యతతో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం మేరకు జాతర నిర్వహిస్తామన్నారు.

రాజకీయాలతో సంబంధం లేకుండా జాతర వైభంగా జరిగేందుకు సహకరించాలని మంత్రులు కోరారు. ప్రభుత్వం కేటాయించిన రూ.75 కోట్ల రూపాయలను మౌళిక వసతుల కల్పనకు ఖర్చు చేశామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఇప్పటికే జంపన్న వాగులోకి లక్నవరం నీటిని విడుదల చేశామని, వాగులో ప్రమాదాలు జరగకుండా గజతగాల్లను ఏర్పాటు చేశామని ఆమె అన్నారు.

మైదాన ప్రాంతంలో ప్లేస్ లు ఏర్పాటు చేశాము. 40 వేలమంది రవాణా విధుల్లో పాల్గొంటారని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. మేడారం జాతరలో ఆర్టీసీ పాత్ర చాలా కీలకమన్నారాయన. గతంలో 3300 బస్సులు ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది జాతర కోసం 3800 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు మాత్రమే సమ్మక్క సారలమ్మ తల్లుల గద్దెల సమీపంలో దిగే ఏర్పాటు ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.