కంట్రోల్ రూంని పరిశీలించిన మంత్రులు

కంట్రోల్ రూంని పరిశీలించిన మంత్రులు

వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా: మేడారం జాతరలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పరిశీలించారు. ములుగు గట్టమ్మ చుట్టుముట్టు, పస్ర నుంచి మేడారం వరకు, మేడారంకు 30 కి. మీ రేడియస్ లో పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మేడారం జాతర సమయంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందుగా కమాండ్ కంట్రోల్ రూంకి చేరే విధంగా, అక్కడి నుండి ఆ సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రతీ 2 కి. మీ. ఒక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనితో ఎక్కడ ట్రాఫిక్ సమస్యలు అక్కడే వెంటనే పరిష్కారం అయ్యే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ వివరాలను జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రాం సింఘ్ మంత్రులకు వివరించారు.