హీరో విశాల్ కు గాయం..వాయిదాపడిన షూటింగ్

హీరో విశాల్ కు గాయం..వాయిదాపడిన షూటింగ్వరంగల్ టైమ్స్, ఫిల్మ్ డెస్క్: ప్రముఖ తమిళ హీరో విశాల్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. డబ్బింగ్ సినిమాల ద్వారా ఇక్కడి ప్రేక్షకుల ఆదరణను దక్కించుకున్నారు. ప్రస్తుతం ‘లాఠీ’ అనే చిత్రంలో నటిస్తున్న విశాల్ గాయపడ్డాడు. ఈ సినిమాలోని ఓ యాక్సన్ సీన్ ను చిత్రీకరిస్తున్న టైమ్ లో అతడు ప్రమాదానికి గురయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా విశాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. విలన్స్ నుంచి ఓ బాబును కాపాడే సన్నివేశాన్ని తీస్తున్న సమయంలో విశాల్ కు గాయాలయ్యాయి. ఈప్రమాదంలో విశాల్ చేతికి, నుదుటి భాగంలో గాయమైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కేరళలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విశాల్ చికిత్స తీసుకుంటున్నాడని సమాచారం. గాయం కారణంగా ఈ సినిమా షూట్ ను ఆపేశారు. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కు ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ డిజైన్ చేశారు. రీసెంట్ గా విడుదలైన సామాన్యుడు షూట్ లోనూ విశాల్ కు గాయాలైన సంగతి తెలిసిందే. కాగా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న లాఠీ సినిమాకు వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో విశాల్ పక్కన సునయన హీరోయిన్ గా నటిస్తోంది.