బైజూస్ సీఈఓకు ఎన్సీపీసీఆర్ సమన్లు

బైజూస్ సీఈఓకు ఎన్సీపీసీఆర్ సమన్లు

బైజూస్ సీఈఓకు ఎన్సీపీసీఆర్ సమన్లువరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : బైజూస్ సంస్థ సీఈఓ రవీంద్రన్ కు ఎన్సీపీసీఆర్ సమన్లు జారీ చేసింది. తమ కోర్సు మెటీరియల్స్ కొనుగోలు చేసేందుకు పేరెంట్స్, చిన్నారులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ న్యూస్ పేపర్ లో వచ్చిన కథనం ఆధారంగా ఈ సమన్లు జారీ చేసినట్లు ఎన్సీపీసీఆర్ పేర్కొన్నది. బైజూస్ తమను బెదిరించి, మోసం చేసి పిల్లల కోర్సు మెటీరియల్ ను అమ్ముతున్నట్లు ఆ కథనంలో ఆరోపణలు చేశారు.

రుణ ఒప్పందం కుదుర్చుకుని పేరెంట్స్ ను ఇబ్బంది పెడుతున్నట్లు బైజూస్ పై ఫిర్యాదులు అందాయి. బైజూస్ లో జరుగుతున్న అక్రమాల గురించి వివరణ ఇవ్వాలని, నేరుగా తమ విచారణ కమిటీ ముందు హాజరుకావాలని ఎన్సీపీసీఆర్ తన నోటీసుల్లో పేర్కొన్నది. 23న రవీంద్రన్ విచారణకు హాజరుకావాల్సి ఉంది.