బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించిన కేసీఆర్‌

బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించిన కేసీఆర్‌

బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించిన కేసీఆర్‌

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : దేశ రాజకీయాల్లో అపూర్వఘట్టం ఆవిష్కృత‌మైంది. దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుంకట్టిన తెలంగాణ సీఎం, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధినేత , కేసీఆర్ బుధవారం ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని మ‌ధ్యాహ్నం 12:37 నుంచి 12:47 గంట‌ల మ‌ధ్య‌ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ జాతీయ జెండాను కేసీఆర్ ఆవిష్క‌రించారు. అనంత‌రం బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని ప్రారంభించి కేసీఆర్ ఆసీనులయ్యారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌కు జాతీయ, రాష్ట్ర నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలిపారు.బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించిన కేసీఆర్‌బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్, జేడీఎస్ అధినేత‌, క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి, తమిళనాడు విసికె పార్టీ అధ్యక్షుడు, ఎంపి తిరుమావళవన్ పలు రాష్ట్రాల రైతు సంఘం నాయకుల‌తో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇత‌ర నాయ‌కులు పాల్గొన్నారు.