మొహాలి టెస్టులో టీమిండియా భారీ విజయం

మొహాలి టెస్టులో టీమిండియా భారీ విజయం

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయం సాధించి 2 మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది. మూడో రోజు ఫాలో ఆన్ తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక 178 పరుగులకు తోకముడిచింది. లంక బ్యాట్స్ మెన్లలో నిరోషన్ డిక్ వెల్లా 51 రన్స్ నాటౌట్ టాప్ స్కోరర్ గా నిలిచాడు.మొహాలి టెస్టులో టీమిండియా భారీ విజయంటీమిండియా స్పిన్ ద్వయం జడేజా, అశ్విన్ చెరో 4 వికెట్లతో శ్రీలంక నడ్డి విరిచారు. షమీ రెండు వికెట్లు తీశాడు. ఓవరాల్ గా తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీయడమే గాక, బ్యాటింగ్ లోనూ 175 రన్స్ నాటౌట్ తో మెరిసిన తొలి టెస్టు మ్యాచ్ హీరోగా నిలిచాడు. ఇక కోహ్లీ వందో టెస్టు ఆడుతున్న నేపథ్యంలో టీమిండియా విజయాన్ని అతనికి బహుమతిగా ఇచ్చింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ లో టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి వచ్చింది. ఇక రెండో టెస్టు మార్చి 12 నుంచి 18 వరకు బెంగళూరు వేదికగా జరుగనుంది.