ప్రాణాలు తీసిన కల్తీ మద్యం

ప్రాణాలు తీసిన కల్తీ మద్యంవరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ లోని అజంగఢ్ లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. అహ్రాలా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహుల్ నగర్ పంచాయతీలో కల్తీ మద్యం సేవించి 9 మంది మృతి చెందారు. మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ మద్యం విక్రయించిన మద్యం దుకాణం ఎదురుగా గ్రామస్తులు బైఠాయించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. మృతుల కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..మృతులంతా మహల్ పట్టణంలోని ఓ వైన్స్ షాపులో మద్యం కొనుగోలు చేశారు. అది తాగిన అనంతరం ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకు 9 మంది మృతి చెందినట్లు సమాచారం అందగా, ఇంకా చాలా మంది ఆస్పత్రిలో చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.