మ్యూజిక‌ల్ వీడియో ‘గాంధారి’ విడుద‌ల‌

మ్యూజిక‌ల్ వీడియో ‘గాంధారి’ విడుద‌ల‌

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ న‌టించిన మొట్ట మొద‌టి తెలుగు పాప్ సాంగ్ ‘గాంధారి’. సోనీ మ్యూజిక్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, ది రూట్ అసోషియేష‌న్‌లో ఈ సాంగ్ రూపొందింది. సోమ‌వారం గాంధారి మ్యూజిక‌ల్ వీడియోను విడుద‌ల చేశారు. కీర్తి సురేష్ అద్భుత‌మైన డాన్స్ మూమెంట్స్ చూప‌రుల‌ను క‌ట్టి ప‌డేశాయి. డైరెక్ట‌ర్‌, కొరియో గ్రాఫ‌ర్ బృంద మాస్ట‌ర్, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ ప‌వ‌న్ సి.హెచ్‌, పాట‌ల ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ‌, సింగ‌ర్ అన‌న్య భ‌ట్ ‘గాంధారి’మ్యూజికల్ వీడియో రిలీజ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ‘గాంధారి’ పోస్ట‌ర్‌ను కీర్తి సురేష్ రిలీజ్ చేశారు.