స్కౌట్స్ & గైడ్స్ ట్రైనింగ్ క్లాసెస్ ప్రారంభం

స్కౌట్స్ & గైడ్స్ ట్రైనింగ్ క్లాసెస్ ప్రారంభంవరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజేషన్ కమిషనర్ సిరిపురం రవీందర్ మరియు సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కమిషనర్ ఎర్ర ఏలియా ఆధ్వర్యంలో కబ్, బుల్ బుల్, స్కౌట్, గైడ్, రోవర్స్, రేంజర్స్ ఒక్క రోజు శిక్షణా శిబిరం నిర్వహించారు. సికింద్రాబాద్ డివిజన్ మేనేజర్ అభయ కుమార్ గుప్తా ఆదేశానుసారం ఈ శిక్షణ తరగతులు నిర్వహించినట్లు సికింద్రాబాద్ రైల్వే డీఎంఓ హరిబాబు తెలిపారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరిబాబు శిక్షణ తరగతులను ప్రారంభించారు.

చాలా రోజుల తరువాత స్కాట్ క్యాంప్ కాజీపేటలో నిర్వహించినందుకు సంతోషంగా ఉందన్నారు హరిబాబు. ఈ శిక్షణా తరగతుల్లో బాల బాలికలు, విద్యార్ధులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. రేపు ఉదయం స్కౌట్స్ వ్యవస్థాపకులు బెడన్ పవల్ 165 వ పుట్టిన రోజు సందర్భంగా వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి ముఖ్య అతిథిగా ఎస్ఆర్ డీపీఓ (Sr DPO)ఎడ్ల అభిలాష్ పాల్గొననున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజేషన్ కమిషనర్ గైడ్ సాజీధ బేగం, మరియు సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కమిషనర్ గైడ్ కోముపల్లి సునీత, ఏడీఓసీ/స్కౌట్స్ పొన్నాల సురేష్ బాబు, ఏడీఓసీ/గైడ్ బక్క శోభ రాణి, సత్రం గోపి, దుసా సంపత్ కుమార్, బొల్ల విద్యా సాగర్,బక్క కృపారాణి,మంజుల వాణి, వంగాల నలినికాంత్,మద్దెర్ల మధన్ మోహన్,బొబ్బిరి శ్రీధర్,కాళేశ్వరం సుదర్శన్,శ్రీనివాస్, శ్రీధర్, దుప్పటి శివ కుమార్, రైల్వే ఉద్యోగులు,సీనియర్ రోవర్స్ & రేంజర్స్ స్కౌట్ గైడ్ లు తదితరులు పాల్గొన్నారు.