3 రోజులు నీటి సరఫరా బంద్.. ఎక్కడంటే!

3 రోజులు నీటి సరఫరా బంద్.. ఎక్కడంటే!

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : ఫిబ్రవరి 6 నుంచి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు బల్దియా పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్ కానుంది. ధర్మసాగర్ వాటర్ ప్లాంట్ వద్ద 2100 ఎం.ఎం.డయాపైప్ లైన్ పై బటర్ ఫ్లై వాల్వ్ ఏర్పాటు పనులు నిర్వహించనున్న క్రమంలో ఈనెల 6,7,8 (సోమ,మంగళ,బుధ వారాల్లో)3 రోజులు వడ్డేపల్లి,కేయూసీ, దేశాయ్ పేట ఫిల్టర్ బెడ్ ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపి వేయబడుతున్నందున నీటి సరఫరా ఉండదని బల్దియా ఈఈ బి.ఎల్.శ్రీనివాసరావు తెలిపారు. వరంగల్ అండర్ రైల్వే జోన్ ప్రాంతాలల్లో నీటి సరఫరా కు ఎలాంటి ఆటంకం లేకుండా యదావిధిగా కొనసాగుతుందని అన్నారు. నగర ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి సహకరించాలని బల్దియా ఈఈ బి.ఎల్.శ్రీనివాసరావు నేడు ఒక ప్రకటనలో తెలిపారు.